: చిరంజీవికి చంద్రబాబు కౌంటర్!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన అంశంపై ఈ రోజు మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో కేంద్రమంత్రి చిరంజీవి మాట్లాడుతూ, సమన్యాయం అంటే ఏమిటో తనకు తెలియదన్నారని బాబు చెప్పారు. ఆయనకు సమన్యాయం విషయంలో ఏమి అర్థం కావడంలేదో తనకు అర్థం కావడంలేదని బాబు పేర్కొన్నారు. ఓ రాష్ట్రాన్ని విభజించినప్పుడు.. 'మేము నష్టపోయాం' అని ఎవరూ వేలెత్తి చూపకుండా, ఆర్ధిక, సామాజిక, ఉద్యోగ, మౌలిక సదుపాయాల విషయంలో అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారం చూపడమే సమన్యాయం అని బాబు నిర్వచించారు.