: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కు బెయిల్


వరుస కేసులలో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు బెయిల్ మంజూరయింది. ఐదు సంవత్సరాల స్వీయ బహిష్కరణ తర్వాత దుబాయ్ లో ఆశ్రయం పొందుతున్న ఆయన ఈ నెల 24న స్వదేశానికి తిరిగిరానున్నారు. ఈ నేపథ్యంలో తనపై ప్రభుత్వం ఎలాంటి అరెస్టు చర్యలు తీసుకోకుండా కరాచీ కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ పొందారు.

తన తండ్రి రక్షణకోసం బెయిల్ ఇవ్వాలని కోరుతూ ముషారఫ్ కుమార్తె అయ్లా రజా వేసిన పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మూడు కేసుల్లో ముషారఫ్ ముందస్తు బెయిల్ పొందారని ఆయన లాయర్ మీడియాకు తెలిపారు. ఆయనకు పూర్తి భద్రత ఉంటుందని, ఎలాంటి అరెస్టులు ఉండవని మరో లాయర్ చెప్పారు. ఈ సమయంలో 'ఆల్ పాకిస్థాన్ ముస్లీం లీగ్' కార్యకర్తలు ముషారఫ్ కు అనుకూలంగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News