: సోమవారం రాష్ట్రపతి చెంతకు విభజన బిల్లు
పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందిన రాష్ట్ర విభజన బిల్లు సోమవారం నాడు రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది. అనంతరం న్యాయ పరమైన అంశాల పరిశీలన కోసం బిల్లును రాష్ట్రపతి న్యాయ నిపుణులకు పంపుతారు. ఈ నేపథ్యంలో, విభజన బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందడానికి మరో నాలుగు రోజులు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.