: సంజయ్ దత్ కు రజనీకాంత్ సానుభూతి


ముంబయి పేలుళ్ళ కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఐదేళ్ళ జైలు శిక్ష విధించడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. సుప్రీం కోర్టు.. తీర్పు వెలువరించిన వెంటనే కదిలిపోయానని రజనీ వెల్లడించారు. సంజయ్ దత్ మంచివాడంటూ వెల్లువెత్తుతున్న క్షమాభిక్ష విన్నపాలు, ప్రార్థనలు ఫలించాలని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

త్వరలోనే సంజయ్ దత్ ఈ విపత్తు నుంచి బయటపడాలని ఆకాంక్షిస్తున్నట్టు రజనీ తెలిపారు. కాగా, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ, ఎంపీ జయా బచ్చన్ తదితరులు కూడా సంజయ్ దత్ ను మారిన మనిషిగా పేర్కొంటూ క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. 

  • Loading...

More Telugu News