: కేరళ సీసీఎల్ టీమ్ ను విమానం నుంచి దింపేసిన పైలట్
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో పాల్గొంటున్న కేరళ స్ట్రైకర్స్ జట్టు ఓ ఎయిర్ హోస్టెస్ తో అనుచితంగా ప్రవర్తించి ఇబ్బందుల్లో పడింది. టాలీవుడ్ జట్టుతో మ్యాచ్ ఆడేందుకు కొచ్చి నుంచి ఈ జట్టు హైదరాబాద్ రావాల్సి ఉంది. ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం ఎక్కిన కేరళ నటులు కొందరు ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా నడుచుకున్నారు. దీంతో, ఆమె పైలట్ కు ఫిర్యాదు చేసింది. ఆగ్రహించిన పైలట్ వెంటనే కేరళ సినీ జట్టు విమానం నుంచి దిగిపోవాలని ఆదేశించాడు. లేకపోతే ఫ్లయిట్ గాల్లోకెగరదని స్పష్టం చేశాడు. దీంతో, జట్టంతా కిందకు దిగక తప్పింది కాదు.