: ఈ ప్యాకేజీ కూడా ఎక్కువే: బొత్స
కాంగ్రెస్ అధిష్ఠానానికి నమ్మిన బంటైన పీసీసీ చీఫ్ బొత్స మరోసారి హైకమాండ్ నిర్ణయానికి వంతపాడారు. నిన్న సీమాంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన ప్యాకేజీ తక్కువేం కాదని అన్నారు. గతంలో ఇతర రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఈ మాత్రం కూడా ఇవ్వలేదని చెప్పారు. సీమాంధ్రకు మరింత మెరుగైన ప్యాకేజీ వచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. విశాఖలో కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన బొత్స... సమావేశానంతరం మీడియాతో మాట్లాడారు.