: ఆ ఘోరం జరిగి ఏడాది పూర్తయింది... కానీ బాధితులు ఇంకా కోలుకోలేదు


హైదరాబాదులో ఆ దారుణం జరిగి సరిగ్గా ఏడాది పూర్తయింది. గతేడాది ఇదే రోజు (ఫిబ్రవరి 21) రాత్రి సుమారు 7 గంటలకు అత్యంత రద్దీగా ఉండే దిల్ షుక్ నగర్లోని 107 సిటీ బస్టాండ్ వద్ద, కోణార్క్ థియేటరుకు ఎదురుగా ఉన్న ఆనంద్ టిఫిన్స్, ఏ-1 మిర్చి సెంటర్ వద్ద అత్యంత శక్తిమంతమైన రెండు బాంబులు పేలాయి. పేలుళ్లలో 17 మంది అమాయక ప్రజలు దుర్మరణం పాలయ్యారు. మరో 100 మంది వరకు క్షతగాత్రులయ్యారు. పేలుళ్ల ఘటనపై దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఎఐ) ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ అహ్మద్ సిద్ధిబాప్ప అలియాస్ యాసిన్ భత్కల్, అతని అనుచరుడు అసదుల్లా అఖ్తర్ అలియాస్ తర్బేజ్ లను అరెస్ట్ చేసింది.

ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్న కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినప్పటికీ, పేలుళ్ల వెనుక అసలు సూత్రధారులెవరో ఇంకా తెలియరాలేదు. వారు పాకిస్థాన్ లో తలదాచుకున్నారనే వార్తలు వినవస్తున్నాయి. ఈ జంట పేలుళ్లు జరిగి సంవత్సరం గడిచినప్పటికీ.. బాధితులు మాత్రం ఇంకా కోలుకోలేదు. ప్రభుత్వం నుంచి తమకు పూర్తిస్థాయి పరిహారం ఇంకా అందలేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. ఉపాధి అవకాశాలను, పరిహారాన్ని అందిస్తామని అప్పట్లో ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ మాట నిలబెట్టుకోలేదని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News