: జగన్ ను కలిసిన ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్


రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ స్వతంత్ర ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఈ రోజు చంచల్ గూడ జైలులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి శ్రీశైలం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి అసెంబ్లీలో కాంగ్రెస్ కు అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కొన్నాళ్లకు సీఎం కిరణ్ ప్రభుత్వంతో విభేదించిన ఆయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారు. పరిస్థితుల కారణంగా వెనక్కు తగ్గిన శ్రీశైలం నేడు జగన్ తో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News