: గూర్ఖాలాండ్ ను ఏర్పాటు చేయండి: జీజేఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ను ఏర్పాటు చేసిన విధంగానే పశ్చిమ బెంగాల్ నుంచి గూర్ఖాలాండ్ ను విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని గూర్ఖా జన్ ముక్తి మోర్చా (జీజేఎం)నిన్న కోల్ కతా లో డిమాండ్ చేసింది. దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం తాము ఉద్యమాలు చేస్తున్నామని మోర్చా అధ్యక్షుడు బిమల్ గురుంగ్ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. కాగా తమ డిమాండ్ల సాధనలో భాగంగా ఈ రోజు ఢిల్లీలో భారీ స్థాయిలో ర్యాలీ చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు. గూర్ఖాలాండ్ ను ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.