: ఆమ్ ఆద్మీ ‘అసెంబ్లీ రద్దు’ పిటిషన్ సోమవారానికి వాయిదా


ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) వేసిన పిటిషన్ ను ఈరోజు (శుక్రవారం) సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఆ పిటిషన్ పై విచారణను ‘సుప్రీం’ సోమవారానికి వాయిదా వేసింది. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి లోక్ సభ ఎన్నికలతో పాటు ఆ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఏఏపీ తన పిటిషన్ లో పేర్కొంది.

సీఎం పదవి చేపట్టిన 49 రోజులకే కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఏర్పాటుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సిఫార్సు చేసిన విషయం విదితమే. దాంతో ఢిల్లీ అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దాంతో, ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అయితే ఢిల్లీ శాసనసభను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఏఏపీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News