: మీ ఆలోచనలతో పక్కవాడిని నడిపించొచ్చు!


శాస్త్రవేత్తలు మరొక అద్భుతాన్ని సాకారం చేశారు. ఒక కోతి మెదడును మరో కోతి మెడడుతో అనుసంధానం చేసి.. ఒకటి చెబితే మరొకటి చేసేలా చేయగలిగారు. హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలో.. ఒక కోతి మెదడులో చిప్ ఏర్పాటు చేశారు. మరో కోతి వెన్నెముకలో ఎలక్ట్రోడ్లను అమర్చారు. మొదటి కోతి మెదడు సంకేతాలు రెండో కోతి వెన్నెముకలోని ఎలక్ట్రోడ్లను చేరేలా చూశారు. ఆ తర్వాత చూస్తే మొదటి కోతి చేయి ఎలా అయితే కదిలించిందో.. రెండో కోతి చేయి కూడా అలానే కదిలించింది. ఈ పరిశోధనా ఫలితాలతో భవిష్యత్తులో పక్షవాతం బాధితులను మరొకరి మెదడు సాయంతో నడిపించవచ్చని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News