: వైట్ హౌస్ లో ఒబామాతో దలైలామా భేటీ నేడు


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో టిబెట్ బౌద్ధ గురువు దలైలామా నేడు వైట్ హౌస్ లో భేటీ అవుతున్నారు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా విభాగం ప్రతినిధి కేత్లిన్ హైడెన్ తెలిపారు. ఒబామా గతంలో 2010 ఫిబ్రవరి, 2011 జూలైలోనూ దలైలామాతో సమావేశమయ్యారని ఆమె చెప్పారు. టిబెట్ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతు ఇవ్వబోదన్నారు. టిబెట్ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు, మానవహక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా దలైలామా, అతని ప్రతినిధులతో చర్చలు ప్రారంభించాలని ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News