: పాస్ వర్డ్ అంటే అక్షరాలే కాదు.. ఇకపై చిత్రాలు కూడా!


పాస్ వర్డ్ అంటే ఆంగ్ల అక్షరాలు, నంబర్లు, ఇతర కేరెక్టర్లు మాత్రమే కాదు.. నచ్చిన చిత్రం కూడా పాస్ వర్డే అని అంటున్నారు రస్ అల్ ఖైమాకు చెందిన శాస్త్రవేత్తలు. వీరు చెబుతున్న దాని ప్రకారం.. మనకు నచ్చిన చిత్రం అది భారత పటం కావచ్చు లేదా తిరుమల ఏడు కొండలు కావచ్చు. పాస్ వర్డ్ సెట్ చేసుకునేటప్పుడు.. నచ్చిన ఆకారంలో చిత్రాన్ని గీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాగిన్ అయ్యే ప్రతీసారీ అదే ఆకారంలో పాస్ వర్డ్ ఇచ్చేస్తే సరిపోతుంది. తిరుమల ఏడు కొండలనే మరెంతో మంది పాస్ వర్డ్ గా పెట్టుకున్నా.. ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమైన కొలతలు ఉంటాయి కనుక మ్యాచ్ అయ్యే అవకాశమే లేదంటున్నారు శాస్త్రవేత్తలు. సో భద్రానికి భద్రం!

  • Loading...

More Telugu News