: పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేను: వెంకయ్యనాయుడు
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి ఉంటే, ప్రత్యేక రాష్ట్రం ఎప్పుడో వచ్చుండేదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. కమిటీలతో కాలయాపన చేస్తూ కాంగ్రెస్ పార్టీ విభజనను పెద్ద సమస్యగా మార్చిందని విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ పూర్తిగా సహకరించిందని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే తెలంగాణ ఇస్తామని ప్రకటించినందుకే, కాంగ్రెస్ పార్టీ తొందరపడిందని చెప్పారు. హైదరాబాదును తెలంగాణలో కలపాలని చెప్పిన మొదటి వ్యక్తిని తానేనని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని స్పష్టం చేశారు.