: తెలంగాణ వచ్చేసింది... గన్ పార్కు వద్ద తెలంగాణవాదుల సంబరాలు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఈరోజు రాజ్యసభ కూడా ఆమోదించిన విషయం విదితమే. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు పాస్ అవడంతో తెలంగాణ వాదుల సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాదులోని గన్ పార్కులో తెలంగాణ వాదులు అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వారి ఆశయం నెరవేరిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. మరో పక్క ఢిల్లీలోని ఏపీ భవన్ లో కూడా తెలంగాణ వాదులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు.