: సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా: ప్రధాని హామీ
సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారు. సీమాంధ్ర ప్రత్యేకంగా ఎదగడానికి ప్రత్యేక హోదా ఉపకరిస్తుందని ప్రధాని చెప్పారు సీమాంధ్రలోని 13 జిల్లాలకు ప్రత్యేక హోదా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాదు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి ఆరు సూత్రాల అభివృద్ధి ప్యాకేజీని ఆయన ప్రకటించారు.