: గవర్నర్ కు అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు: కేంద్రమంత్రి కపిల్ సిబాల్
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ అరుణ్ జైట్లీ కొన్ని ప్రశ్నలను సభ ముందుంచారు. అనంతరం కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ సభలో మాట్లాడారు. గవర్నర్ కు అధికారాల అప్పగింతపై అరుణ్ జైట్లీ కొన్ని సందేహాలు లేవనెత్తారని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని 3, 4 అధికరణలు అరుణ్ జైట్లీ సందేహాలను నివృత్తి చేస్తాయని ఆయన తెలిపారు. గవర్నర్ అదనపు బాధ్యతలు నిర్వర్తించడానికి రాజ్యాంగం అనుమతించిందని ఆయన చెప్పారు. గవర్నర్ కు అదనపు అధికారాలు కాదు... అదనపు బాధ్యతలు మాత్రమే అప్పజెప్పామని కపిల్ సిబాల్ చెప్పారు.