: తెలంగాణలో సీమాంధ్రులకు తగిన గౌరవం ఇవ్వాలి: కాంగ్రెస్ ఎంపీ ఎం.ఏ.ఖాన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు మహ్మద్ అలీ ఖాన్ రాజ్యసభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు. విభజన నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు ఎం.ఏ.ఖాన్ చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్రులకు తగిన గౌరవం లభించేటట్లు చూడాలని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి అవసరమైన ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయన తెలిపారు.