: విభజన బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం: ఎస్పీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని సమాజ్ వాదీ సభ్యుడు రాం గోపాల్ యాదవ్ చెప్పారు. రాజ్యసభలో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన యాదవ్, విభజన పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు పెంచారన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ రాష్టాల విభజనను వ్యతిరేకించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.