: సమైక్యవాదినైనా.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా: చిరంజీవి
తాను మొదటి సారి సభలో మాట్లాడుతున్నానని... అందువల్ల సభ్యులందరూ సహకరించాలని చిరంజీవి కోరారు. రాష్ట్ర విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ వాదిగా ఉంటూ సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం బాధాకరంగా ఉందని చెప్పారు. విభజన విషయంలో పార్టీ అనుసరించిన విధానం బాధాకరమని అన్నారు. విభజన అనేది 11 కోట్ల మంది గుండె కోతకు సంబంధించిన అంశమని తెలిపారు. వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినైనా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. లోక్ సభలో బిల్లుపై చర్చలో ఎవరికీ అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని... రాజ్యసభలోనైనా సీమాంధ్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు.