: ఇప్పుడున్న పరిస్థితుల్లో విడిపోవడమే మేలు: రాజ్యసభలో వెంకయ్యనాయుడు
రాజ్యసభలో వెంకయ్యనాయుడు తెలంగాణ బిల్లు చర్చలో భాగంగా ఉద్విగ్నంగా ప్రసంగించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆయన మాట్లాడారు. ఆయన ప్రసంగం ముఖ్యాంశాలు ఇవి. * హైదరాబాదును కోల్పోతే సీమాంధ్ర ప్రాంతానికి ఆదాయం దారుణంగా తగ్గిపోతుంది. * తెలంగాణ, రాయలసీమ రెండు ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. * ఉత్తరాంధ్ర, రాయలసీమకు పన్ను మినహాయింపులు కావాలి. * సీమాంధ్రలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. * సీమాంధ్రలో పోర్టులు, విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలి. * హైదారాబాదు లో మిగులుతున్న ఆదాయాన్ని మిగతా ప్రాంతాలకు పంపిణీ చేయాలి * హైదరాబాదుతో కూడిన తెలంగాణలో మాత్రమే మిగులు రెవెన్యూ ఉంది. * విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల స్థాయిని పెంచాలి. * సీమాంధ్రలో ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పాలి. * సీమాంధ్రకు 10 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలి. * ప్రాంతాలను విభజించండి, ప్రజలను కాదు. * ఉత్తర తెలంగాణ కూడా బాగా వెనుకబడి ఉంది. * 2004 నుంచి తెలంగాణ విషయంలో కాంగ్రెస్ రాజకీయ లబ్దితో వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. * కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. * కాంగ్రెస్ అవకాశవాద పార్టీ. * హైదరాబాదుకు సమాంతరంగా సీమాంధ్రలో విద్యా సంస్థలు, పరిశ్రమలు నెలకొల్పాలి. * కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు, వారు పంపిన కాగితాలకు పొంతన లేదు. * హైదరాబాదులో అందరికీ నివసించే హక్కు ఉంది. * బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒకలా, సీమాంధ్రలో మరోలా ప్రజారం చేస్తోంది. * కాంగ్రెస్ ముందు తన ఇల్లు చక్కదిద్దుకోవాలి.