: రాజ్యసభ మళ్లీ 15 నిమిషాలు వాయిదా
పలుమార్లు వాయిదా నేపథ్యంలో రాజ్యసభ మళ్లీ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరగాల్సి ఉండగా సీమాంధ్ర ఎంపీలతో పాటు మిగతా పార్టీల సభ్యులు కూడా వెల్ లోకి వెళ్లి తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో సభలో గందరగోళం ఏర్పడటం, సభ సజావుగా సాగేందుకు వీలు లేకపోవడంతో డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.