: తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన షిండే
తెలంగాణ బిల్లును రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రవేశపెట్టారు. వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో, డిప్యూటీ ఛైర్మన్ కురియన్ తెలంగాణ బిల్లు రాజ్యాంగబద్ధతపై నోటీసులిచ్చిన అరుణ్ జైట్లీ, సుజనాచౌదరి, రాజీవ్ చంద్రశేఖర్, నరేష్ గుజ్రాల్, డెరిక్ ఓబెరాయ్ లను ప్రస్తావిస్తూ, బిల్లును ప్రవేశపెట్టాల్సిందిగా షిండేను కోరారు. ఈ సమయంలో కొందరు ఎంపీలు షిండేకు రక్షణగా నిలవగా, కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. షిండే బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే వెల్లువెత్తిన నిరసన కారణంగా రాజ్యసభను వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు.