: తెలంగాణ బిల్లెక్కడ? : కురియన్ ను ప్రశ్నించిన బీజేపీ
తెలంగాణ బిల్లును ఏం చేశారని బీజేపీ నేతలు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ లు రాజ్యసభ ఉపసభాపతి కురియన్ ను ప్రశ్నించారు. దీనిపై కురియన్ స్పందిస్తూ ప్రభుత్వాన్ని అడగండి అన్నారు. దీంతో ప్రభుత్వం ఎక్కడ? అంటూ వారు తిరిగి ప్రశ్నించారు. దీంతో మంత్రులకు పలు బాధ్యతలు ఉంటాయని, అన్నింటికీ వారు రావడం కుదరదని సమాధానమిచ్చారు. కాగా రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఉన్నారు. ఆ సమయంలో సీమాంధ్ర ఎంపీలు, తమిళనాడు ఎంపీలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి చిరంజీవి తన స్థానంలో నిలబడి మౌనంగా నిరసన తెలిపారు.