: బిల్లు ఆమోదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: కమల్ నాథ్
రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ తెలిపారు. ఇలాంటి దశలో సవరణ ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. లోక్ సభలో ఒక్క సవరణ కూడా కోరని బీజేపీ ఇప్పుడు సవరణ అంటోందని వ్యాఖ్యానించారు. అయితే, తెలంగాణ బిల్లుకు సహకరించాలని బీజేపీ నేతలను కోరామన్నారు. సీమాంధ్రకు పూర్తి స్థాయి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పారు.