: గవర్నర్ తో ముగిసిన మంత్రుల భేటీ
గవర్నర్ నరసింహన్ తో నలుగురు మంత్రుల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, ధన్యవాదాలు తెలిపేందుకే గవర్నర్ ను కలిశామని చెప్పారు. ఎలాంటి రాజకీయ అంశాలు మాట్లాడలేదని తెలిపారు. ఆనంతో పాటు, బొత్స, కన్నా లక్ష్మీ నారాయణ, రఘువీరారెడ్డి గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు.