: ప్రారంభమైన రాజ్యసభ.. అరగంట వాయిదా
వాయిదా అనంతరం రాజ్యసభ మరోసారి ప్రారంభమైంది. యథాప్రకారం సభలో సీమాంధ్ర, తమిళ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. సభ్యులను సముదాయించడానికి డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రయత్నించినప్పటికీ... ఎవరూ ఆయన మాట వినలేదు. దీంతో సభను అరగంట పాటు వాయిదా వేస్తున్నట్టు కురియన్ ప్రకటించారు.