: మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల ఆరోగ్యం కుదుటపడుతోంది
కృష్ణాజిల్లా మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోందని కుటుంబసభ్యులు మీడియాకు తెలిపారు. ముంబయిలోని ‘ఏషియన్ మెడికల్ ఇనిస్టిట్యూట్’లో మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి అర్థరాత్రి రెండు గంటల వరకు గుండెకు ఆపరేషన్ జరిగింది. పూడుకుపోయిన మూడు రక్తనాళాలను డాక్టర్ పండా, కోహ్లిలు సరిచేశారని కొనకళ్ల సోదరుడు జగన్నాథరావు తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన స్పృహలోకి వచ్చారని, మరో రెండు రోజులు ఆయనను ఐసీయూలోనే ఉంచుతారని జగన్నాథరావు చెప్పారు.