: హైకోర్టులో మోహన్ బాబు అభ్యర్థన తిరస్కరణ
'పద్మశ్రీ' పురస్కారం ఉపసంహరణకు రాష్ట్రపతికి సిఫారసు చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశిస్తూ గత వారం ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలన్న సినీ నటుడు, నిర్మాత ఎం.మోహన్ బాబు అభ్యర్థనను రాష్ట్ర హైకోర్టు తోసిపుచ్చింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సేన్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు స్పష్టం చేసింది. అయితే, ఏదైనా సినిమాల్లో 'పద్మశ్రీ'ని వాడి ఉంటే అక్కడా తొలగించాలన్న ఆదేశాలను కూడా తాము అమలు చేశామని మోహన్ బాబు రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. పరిశీలించిన న్యాయస్థానం, ఈ వ్యాజ్యంపై ఇక తదుపరి విచారణ అవసరం లేదంటూ విచారణను ముగించింది.