: మహిళలే డ్రైవర్లుగా ‘షీ క్యాబ్స్’ హైదరాబాదు రోడ్డెక్కాయి


రాష్ట్రంలోనే మొదటిసారిగా మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా ‘షీ క్యాబ్స్’ హైదరాబాదు రోడ్డెక్కాయి. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంఘం ఆధ్వర్యంలో నడిచే ఈ క్యాబ్స్ ను పబ్లిక్ గార్డెన్స్ లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ, ట్రాఫిక్ డీసీపీ సుధీర్ బాబు, సామాజిక కార్యకర్త రాగిడి లక్ష్మారెడ్డి జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షీక్యాబ్స్ ఎండీ విజయారావు, సీఈవో అనూరాధారావు పాల్గొన్నారు.

మహిళలే క్యాబ్ నడిపిస్తామని ముందుకు రావడం గొప్ప విషయమని నీలం సహానీ అన్నారు. ఈ క్యాబ్స్ రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు విస్తరించాలని ఆమె ఆకాంక్షించారు. షీ క్యాబ్స్ ఎండీ విజయారెడ్డి మాట్లాడుతూ.. ముందుగా రెండు కార్లను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఆదరణను బట్టి మరిన్ని ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు.

నగరాల్లో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా వారికి సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ క్యాబ్స్ ప్రవేశపెట్టామని విజయారెడ్డి తలిపారు. క్యాబ్ లో జీపీఎస్ విధానాన్ని అమర్చామన్నారు. క్యాబ్ కావల్సిన వారు 9393024242కు ఫోన్ చేయాలని ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News