: ఫేస్ బుక్ యూజర్లూ బీ రెడీ.. మోడీ, కేజ్రీవాల్ ను ప్రశ్నించడానికి
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్రమోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తదితరులను ఫేస్ బుక్ యూజర్లు ప్రశ్నించవచ్చు. ఎన్నికల నేపథ్యంలో ఇందుకోసం టాక్స్ లైవ్ పేరుతో ఫేస్ బుక్ ప్రత్యేక పేజీని అందుబాటులోకి తెచ్చింది. అధికారంలోకి వస్తే ఏం చేస్తారంటూ నేతలను ప్రశ్నించవచ్చని, వారి అజెండా, ప్రాధాన్యతలను అడిగి తెలుసుకోవచ్చని ఫేస్ బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకి దాస్ తెలిపారు. యూజర్లు వేసే ప్రశ్నలను ప్రముఖ జర్నలిస్టు మధు ట్రెహాన్ నేతలకు సంధించనున్నారు. మార్చి 3న జరిగే ప్రత్యేక సెషన్ లో మోడీ పాల్గొననున్నారు.