: ఊపిరి సలపని షూటింగులతో కత్రినకు అనారోగ్యం


కత్రినా కైఫ్ మరోసారి అనారోగ్యం పాలైంది. 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా షూటింగు సమయంలో ఆమె జ్వరాన పడింది. దీంతో నిన్న షూటింగ్ నిలిపివేశారు. గతంలో కత్రిన అనారోగ్యం వల్లే ఈ చిత్రాన్ని నవంబర్ నుంచి జనవరికి వాయిదా వేసుకున్నారు. అయినా, ఆమె ఆరోగ్యం గాడిన పడినట్లు లేదు. ప్రియుడు రణబీర్ కపూర్ తో కలసి అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కత్రినా తొలిసారిగా అనారోగ్యం పాలైంది. ఆ తర్వాత నుంచి షూటింగుల పనిమీద కత్రిన తరచూ ప్రయాణిస్తోందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. 'బ్యాంగ్ బ్యాంగ్'లో సహ నటుడు హృతిక్ రోషన్ కూడా ఇటీవలే అనారోగ్యానికి గురవడం యాధృచ్చికం.

  • Loading...

More Telugu News