: కోటి మంది భారతీయుల అమెరికా కల


ఆర్థిక మాంద్యం అమెరికాను అతలాకుతలం చేసినప్పటికీ, ఆ దేశం పట్ల ఇతర దేశీయులలో మోజు మాత్రం తగ్గలేదు. అమెరికాలో స్థిరపడిపోవాలని కోటి మంది భారతీయులు కోరుకుంటున్నారు. ఇలా అమెరికా వైపు అడుగులు వేయాలని ప్రపంచ వ్యాప్తంగా 10కోట్ల మంది కోరుకుంటున్నారని ప్రముఖ సర్వే సంస్థ గల్లప్ తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.

10కోట్ల మందీ అమెరికానే స్వర్గసీమగా చెయ్యెత్తి జై కొట్టారు. అత్యధికంగా కోటీ 90 లక్షల మంది చైనీయులు అమెరికా వెళ్లిపోవాలని కోరుకుంటుంటే, వీరి తర్వాత కోటీ 30 లక్షల మంది నైజీరియన్లు అగ్రరాజ్యంలో స్థిరపడాలని ఆశిస్తున్నారు. 

ముస్లిం దేశాలలో అమెరికా పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, మన పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి మాత్రం 60లక్షల మంది అమెరికా చెక్కేయాలని చూస్తున్నారట. కానీ, పాకిస్థాన్, ఇరాన్ దేశాలకు వచ్చేసరికి అమెరికా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. పాక్ వాసులు సౌదీ అరేబియా, బ్రిటన్ దేశాలే తమ కలల దేశంగా చెప్పారు.

ఇరానియన్లు జోర్డాన్, లెబనాన్ లో స్థిరపడాలనుకుంటున్నట్లు చెప్పారు. అమెరికా తర్వాత ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న దేశాలు బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్.  మొత్తానికి ప్రపంచం మొత్తం మీద 13.8 కోట్ల మంది స్వదేశాలను వీడి విదేశాలలో పాగా వేయాలని అనుకుటున్నట్లు సర్వేలో వెల్లడైంది. 

  • Loading...

More Telugu News