: ఉద్యోగం ఇవ్వనన్న కంపెనీకే వాట్స్ యాప్ ను అమ్ముతున్న ఘటికుడు
విధి చేసే విచిత్రాలు ఇలానే ఉంటాయి. వాట్స్ యాప్ అనే మెస్సేజింగ్ అప్లికేషన్ ను అమెరికాకు చెందిన బ్రియాన్ యాక్షన్, ఉక్రెయిన్ కు చెందిన జాన్ కౌమ్ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఇప్పుడు వీరి నుంచి వాట్స్ యాప్ ను ఫేస్ బుక్ కొనుగోలు చేస్తోంది. బ్రియాన్, కౌమ్ ఇద్దరూ వాట్స్ యాప్ ఆవిష్కరణకు ముందు యాహూలో కలిసి పనిచేశారు. ఆ సమయంలో బ్రియాన్ ఫేస్ బుక్ లో ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఫేస్ బుక్ నిరాకరించింది. నాడు బ్రియాన్ కు ఫేస్ బుక్ ఉద్యోగం ఇచ్చి ఉంటే.. నేడు వాట్స్ యాప్ అవతరించి ఉండేది కాదు. ఫేస్ బుక్ 1.17లక్షల కోట్ల భారీ మొత్తానికి వాట్స్ యాప్ ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితీ వచ్చేది కాదు.