: ద్రావిడ్ ఇక 'డాక్టర్'
భారత క్రికెట్ కు అమూల్యమైన సేవలందించిన కర్ణాటక ఆణిముత్యం రాహుల్ ద్రావిడ్ గౌరవ డాక్టరేట్ అందుకోనున్నాడు. గుల్బర్గా విశ్వవిద్యాలయం ద్రావిడ్ ను డాక్టరేట్ తో సత్కరించాలని నిర్ణయించింది. వర్శిటీ 32వ స్నాతకోత్సవం సందర్భంగా ద్రావిడ్ కు డాక్టరేట్ ప్రదానం చేస్తారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మొత్తం 12 మందిని డాక్టరేట్ తో గౌరవించనున్నారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ పుట్టయ్య డాక్టరేట్ స్వీకర్తల పేర్లను ప్రకటించారు.