: ఈసారి అధికారం తృతీయ కూటమిదే: ములాయం


వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయం తృతీయ కూటమిదేనని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ జోస్యం చెప్పారు. ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా... కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్-అమెరికా అణు ఒప్పందానికి సహకరించి తప్పు చేశామన్న ములాయం...కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబానికి తప్ప ఇతరులకి చోటు లేదని వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబం నాలుగవ తరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల చరిష్మా పార్టీకి ఉపయోగపడటం లేదని ములాయం అన్నారు. 

  • Loading...

More Telugu News