: నేటి నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
ఈ రోజు నుంచి ఆన్ లైన్ లో ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 4 వరకు జరగనుంది. అన్ని రకాల అపరాధ రుసుములతో మే 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణారావు తెలిపారు. మే 17న ఎంసెట్ నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీన ఎంసెట్ -2014 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.