: విభజనను ఆపలేకపోయారు... ఇప్పటికైనా కళ్లు తెరవండి: సబ్బం హరి


రాష్ట్ర విభజనపై చర్చకు పట్టుబడతామని చెప్పిన బీజేపీ చివరికి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు వంతపాడిందని ఎంపీ సబ్బం హరి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనను ఎలాగూ ఆపలేకపోయిందనీ, కనీసం సీమాంధ్రకు న్యాయం చేసేందుకైనా బీజేపీ పట్టుబట్టాలని డిమాండ్ చేశారు. యూపీఏ ఎత్తుగడల్లో భాగం కావొద్దని, ఇప్పటికైనా కళ్లు తెరిచి ఐదు కోట్ల మంది ప్రజలకు న్యాయం చేయాలని బీజేపీకి సబ్బం సూచించారు. న్యాయమైన సీమాంధ్రుల కోరికలను తీర్చాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News