: రాష్ట్ర విభజనకు నిరసనగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన టీడీపీ నేతలు
లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదం లభించడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు టీడీపీ శాసనసభ్యులు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయానికి రాజీనామాలను ఫ్యాక్స్ చేసిన వారిలో గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నరేంద్ర, రామకృష్ణ తదితరులు ఉన్నారు.