: 'తెలంగాణ'పై ఈ రోజు ఏం జరిగింది?
తెలంగాణ బిల్లును ఈరోజు (బుధవారం) రాజ్యసభలో ప్రవేశపెట్టినా.. దానిపై చర్చ ముందుకు సాగలేదు. రాజ్యసభను గురువారానికి వాయిదా వేసినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణా విషయంపై జరిగిన ఘటనలు మినిట్ టు మినిట్.. మీ కోసం.
సాయంత్రం 6:01 గంటలు: సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని ప్రధాని మన్మోహన్ ను సోనియా గాంధీ కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
5:18 గంటలు: తెలంగాణ బిల్లును రాజ్యసభలో రేపు ప్రవేశపెడతాం: కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా
5:10 గంటలు: తెలంగాణ బిల్లును సభలో ఈరోజు చర్చకు తీసుకోవడం లేదు. రాజ్యసభ రేపటికి వాయిదా
5:01 గంటలు: బిల్లులో సవరణలు చేయాలని పట్టుబట్టిన బీజేపీ
4:51 గంటలు: సీమాంద్ర ప్రాంతానికి భారీ ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వ యోచన
4:42 గంటలు: తెలంగాణ బిల్లును ఆమోదింపజేయాలని బీజేపీని కోరిన ప్రధాని మన్మోహన్, హోంమంత్రి షిండే
4:40 గంటలు: సాయంత్రం 5 గంటల వరకు వాయిదాపడిన రాజ్యసభ
4:32 గంటలు: వీధి వ్యాపారుల బిల్లు, గవర్నర్ల జీతభత్యాల బిల్లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు రాణీ లక్ష్మీబాయి వ్యవసాయ వర్శిటీ బిల్లులకు మూజువాణి ఓటు ద్వారా సభ ఆమోదం
సాయంత్రం 4:01 గంటలు: రాజ్యసభ పునః ప్రారంభం.. తెలంగాణ బిల్లుపై మూడు సవరణలను సభ ముందుంచిన బీజేపీ
మధ్యాహ్నం 3:04 గంటలు: రాజ్యసభ కార్యదర్శిపై దాడి చేసినందుకు క్షమాపణ చెప్పిన టీడీపీ ఎంపీ
3:03 గంటలు: వాయిదా అనంతరం, సభా కార్యక్రమాలు పునః ప్రారంభం
2:32 గంటలు: రాజ్యసభ మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదా
2:25 గంటలు: తెలంగాణ బిల్లును సభ ముందుంచిన ప్రభుత్వం
2:19 గంటలు: తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో చర్చించడానికి వీల్లేదని, బిల్లు లోక్ సభలో నియమానుసారం ఆమోదం పొందలేదన్న సమాజ్ వాది పార్టీ
2:15 గంటలు: సభను స్పీకర్ అదుపులో ఉంచాలి, మంత్రులే సభలో ఆందోళన చేస్తుంటే.. ప్రభుత్వమే సభ్యులను విడదీయాలని చూస్తున్నట్లుంది: బీజేపీ
2:09 గంటలు: నినాదాలతో సభను హోరెత్తించిన సీమాంధ్ర ఎంపీలు
2:04 గంటలు: వాయిదా అనంతరం, సభా కార్యక్రమాలు పునః ప్రారంభం
1:31 గంటలు: నేనింతకు ముందే పదవిని వీడేవాడిని, కానీ మద్దతుదారులు నన్ను ఆపేశారు: సీఎం కిరణ్
1:22 గంటలు: తెలంగాణ బిల్లును సాయంత్రం 4 గంటలకు ప్రవేశపెడతామని రాజ్యసభ ప్రకటన
12:32 గంటలు: రాజ్యసభ ప్రధాన కార్యదర్శిని తోసివేసి, పేపర్లు లాక్కొనేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్
మధ్యాహ్నం 12:06 గంటలు: రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారం లేకుండా.. బిల్లుపై చర్చించడానికి వీల్లేదన్న బీజేపీ
ఉదయం 11:46 గంటలు: లోక్ సభ వాయిదా
11:45 గంటలు: రాజీనామా చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కొత్త పార్టీ పెట్టే అవకాశం
11:07 గంటలు: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్, అలాగే కాంగ్రెస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి కూడా కిరణ్ రాజీనామా
తెలుగు ప్రజలకు జరిగిన మోసానికే రాజీనామా చేస్తున్నా.. వ్యక్తిగత అభీష్టమేదీ లేదన్న కిరణ్
11:07 గంటలు: మధ్యాహ్నం వరకు వాయిదా పడిన రాజ్యసభ
11:00 గంటలు: తెలంగాణ బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన నేపథ్యంలో సీఎం కిరణ్ మీడియా సమావేశం