: సీమాంధ్రకు ప్యాకేజీ ఇవ్వాలని బీజేపీ లోక్ సభలో కోరలేదు: కమల్ నాథ్
సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రాజ్యసభలో బీజేపీ సవరణ కోరిందని కేంద్ర మంత్రి కమల్ నాథ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ లోక్ సభలో ఒకరకంగా, రాజ్యసభలో మరో రకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిన్న లోక్ సభలో ఆ పార్టీ సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీపై ఎలాంటి సవరణ కోరలేదని అన్నారు. సీమాంధ్రకు ప్యాకేజీ అంశం పరిశీలించాలని 14వ ఆర్థిక సంఘాన్ని కోరుతూ బిల్లులో పొందుపరిచామని కమల్ నాథ్ తెలిపారు.