: నా తండ్రి హంతకులనే విడిచిపెడితే, ఇక సామాన్యులకు న్యాయమెక్కడ?: రాహుల్ గాంధీ


తన తండ్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులను విడిచిపెట్టడంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. రాజీవ్ హత్య కేసు ముద్దాయిలను విడుదల చేస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రధానిగా పని చేసిన వ్యక్తిని చంపేసిన వారినే వదిలేస్తే ఇక సామాన్యపౌరులకు న్యాయం ఎలా ఆశిస్తామని ప్రశ్నించారు. మరణశిక్షకు తాము వ్యతిరేకమని, అయితే, ప్రధానిని చంపినవారు ఇలా కూడా స్వేచ్ఛను పొందవచ్చా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాహుల్ స్పందించిన కాసేపటికే జయలలిత చర్య బాధ్యతారాహిత్యమని, ఇది కేవలం ఎన్నికల స్టంట్ అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

  • Loading...

More Telugu News