: సీఎం పదవికి చిరు ఒంటరి పోరు


కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన ముఖ్యమంత్రి పదవికి గిరాకీ పెరిగింది. ఈ పదవిని దక్కించుకునేందుకు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు లాబీయింగ్ ప్రారంభించారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినందున, రాష్ట్ర విభజన జరిగిన కారణంగా ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని నియమించాలని ఆ ప్రాంత నేతలు బలంగా కోరుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అనిపించుకోవాలని కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి ఉబలాటపడుతున్నారు. దీంతో ఎవరికి వారు తమ వర్గాలతో అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు ప్రారంభించారు. ఆనం, కన్నా, బొత్స, రఘువీరాలు తమలో ఏ ఒక్కరికి ముఖ్యమంత్రి పదవి దక్కినా పర్వాలేదని వ్యాఖ్యానిస్తుండగా, కేంద్ర మంత్రి చిరంజీవి మాత్రం తన పలుకుబడితో ఒంటరి పోరు సాగిస్తున్నట్టు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్న విషయంలో ఆసక్తి పెరుగుతోంది.

  • Loading...

More Telugu News