: హైదరాబాదులో పుష్పాలంకరణ పోటీలు
హైదరాబాదు విద్యానగర్ లో పుష్పాలంకరణ (ఫ్లవర్ డెకరేషన్) పోటీలు జరిగాయి. డీడీ కాలనీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థులు ఉత్సాహంగా ఈ పుష్పాలంకరణ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రంగు రంగుల పూలను వివిధ ఆకృతుల్లో ఉన్న బొకేలలో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పోటీలను హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థులతో పాటు పరిసర ప్రాంత గృహిణులు అధిక సంఖ్యలో వీక్షించారు. ముఖ్యంగా అపార్ట్ మెంట్ ఆకృతిలో ఉన్న బొకేలో పువ్వులు, షూ లో అమర్చిన పుష్పాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.