: విద్యార్థితో టీచరమ్మ సరసాలు.. ఆనక జైలుపాలు


విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఆ ఉపాధ్యాయురాలు ఓ విద్యార్థికి ప్రేమ పాఠాలు బోధిస్తూ కటకటాలపాలైంది. సింగపూర్లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 42 ఏళ్ళ వయసున్న ఓ టీచర్.. అదే స్కూల్లో చదువుతున్న 13 ఏళ్ళ విద్యార్థితో గత కొంతకాలంగా అత్యంత 'సన్నిహితం'గా మెలుగుతోంది. ఓ రోజు బాలుడి పెదవులపై ముద్దు పెట్టడమే కాకుండా, భుజాలు, మెడపై ప్రేమ సూక్తులు రాసింది. అంతేగాకుండా, అతగాడిని పార్కుల వెంట తిప్పుతూ, ఫేస్ బుక్ లో నిత్యం చాటింగ్ చేస్తూ ఉండడంతో అనుమానమొచ్చిన ఆ బాలుడి తల్లిదండ్రులు విషయం ఆరా తీశారు. దీంతో, ఆవిడ సరసాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై, బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఆమెపై మోపిన అభియోగాలు రుజువైతే ఐదేళ్ళ వరకు శిక్ష పడవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News