: సంజయ్ దత్ పెరోల్ విషయంలో చట్టాన్ని అతిక్రమించలేదు: పృథ్వీరాజ్ చవాన్


ప్రముఖ బాలీవుడ్ సినీనటుడు సంజయ్ దత్ పెరోల్ విషయంలో ప్రభుత్వం చట్టాన్ని అతిక్రమించలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వెల్లడించారు. ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ తన భార్యకు ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో డిసెంబర్ 21 నుంచి పెరోల్ మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ఆయన యరవాడ జైలుకు తిరిగి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చవాన్ ప్రభుత్వం సంజయ్ పెరోల్ ను మరో నెల పాటు పొడిగించింది. ఈ క్రమంలో విమర్శలు వెల్లువెత్తడంతో, చవాన్ తాము చేసిన పనిని సమర్థించుకున్నారు.

  • Loading...

More Telugu News