: సంజయ్ కు క్షమాబిక్ష పెట్టండి: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కట్జూ


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ బాసటగా నిలిచారు. 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో ఐదేళ్ల శిక్ష పడ్డ సంజయ్ కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం క్షమాబిక్ష పెట్టాలని మహారాష్ట్ర గవర్నర్ కె.శంకర్ నారాయణన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేలుళ్ల కేసులో సంజయ్ కు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ఆయనను దోషిగా నిర్ధారించలేదన్నారు.

ఇప్పటికే 16 నెలల శిక్ష అనుభవించి ఎంతో మానసిక వ్యథకు గురయ్యాడని చెప్పారు. లైసెన్స్ లేకుండా కేవలం ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసులోనే సంజయ్ దత్ కు శిక్ష పడినట్లు ప్రకటనలో వివరించారు. ఈ క్రమంలో సంజయ్ కు క్షమాభిక్ష పెట్టే అవకాశం గవర్నర్ లేదా రాష్ట్రపతికి ఉందని పేర్కొన్నారు. కనీసం శిక్షను తగ్గించేందుకైనా గవర్నర్ చొరవ చూపాలని కట్జూ కోరారు.

  • Loading...

More Telugu News