: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదాలతో హోరెత్తిన రాజ్యసభ
రాజ్యసభలో గందరగోళం నెలకొంది. రాజ్యసభలో సభ్యులు మాట్లాడుతుండగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సభ్యులు రాజ్యసభ ఛైర్మన్ వెల్ వద్దకు దూసుకుపోయి తమ నిరసనను కొనసాగిస్తున్నారు. వారు సభలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. సీమాంధ్ర ఎంపీలను తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాల్సిందిగా కురియన్ కోరారు. అంతేకాని, సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించవద్దని కురియన్ సీమాంధ్ర ప్రాంత ఎంపీలకు చెప్పారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రాంత ఎంపీలకు, కురియన్ కు మధ్య వాగ్వాదం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ వెల్ దగ్గరకు వెళ్లి నిరసన తెలుపుతున్న వారిలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులున్నారు.