: తగ్గిన బైకుల ధరలు
హోండా, హీరో కంపెనీలు అన్ని రకాల బైకులు, స్కూటర్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించాయి. బడ్జెట్ లో ఎక్సైజ్ సుంకాన్ని 12 నుంచి 8 శాతానికి తగ్గిస్తూ ఆర్థిక మంత్రి నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇవి వెంటనే ధరలను తగ్గించాయి. 2 నుంచి 5 శాతం వరకు వాహన రకాలను బట్టి తగ్గింపు ఉంటుందని హీరో మోటో కార్ప్ వెల్లడించింది. హోండా కూడా వాహనాన్ని బట్టి 1,600 నుంచి 7,600 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బడ్జెట్లో ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ఆ మేరకు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది.