: ఢిల్లీలో పేలుళ్ల కుట్ర భగ్నం
దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలన్న ఉగ్రవాదుల యత్నాన్ని పోలీసులు విచ్చిన్నం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో అనుమానిత హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది లియాఖత్ అలి అరెస్ట్ తో ఈ కుట్ర బయటపడింది. అతడిని గురువారం అరెస్ట్ చేసి పోలీసులు డిల్లీకి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. లియాఖత్ వద్ద నుంచి పోలీసులు ఏకే 47 రైఫిల్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
లియాఖత్ ఇచ్చిన సమాచారం మేరకు గురువారం రాత్రి ఢిల్లీలోని జామా మసీదు ప్రాంతంలో, హజీ అరాఫత్ గెస్ట్ హౌస్ లో పోలీసులు, బాంబు నిర్వీర్యక దళాలు తనిఖీలు జరిపి 304 రూమ్ నుంచి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ గది నుంచి మందుగుండు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.